రాజకీయ పార్టీల అతీతంగా ప్రతిఒక్కరు బాధ్యత చూపాల్సిన సమయం. సమాజం మనకు గుర్తింపునిచ్చింది, బాధ్యతనిచ్చింది. అలాంటి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కోవిడ్నిపుణులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేయాల్సిన కార్యక్రమాలు వారు చేయాలి. ప్రజలందరికీ కరోనా విషయంలో అవగాహన పెంచడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, సైకాలజిస్ట్ లు, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, కరోనా బాధితులకు సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థల సభ్యులు, కరోనా నుంచి కోలుకున్న వివిధ వర్గాల ప్రజలతో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మరో వెబినార్ నిర్వహించారు. గతంలో డాక్టర్లు, వైద్య సిబ్బందితో వెబినార్ నిర్వహించిన విషయం విదితమే. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్(జిఎఫ్ ఎస్ టి) ద్వారా ప్రతివారం కేంద్రానికి లేఖలు పంపడం తెలిసిందే. ప్రతి పక్షంలో ఉన్నప్పటికి ప్రజల పట్ల తన బాధ్యతగా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు గారు ప్రస్తుతం ఉన్న నెలకొన్న విపత్కర పరిస్తితులు వివరించిన విధానం
పాజిటివ్ కేసుల పెరుగుదల మన రాష్ట్రంలో 15.2% ఉంది. ప్రతి 12.8 రోజులకు రెట్టింపు కేసులతో డబ్లింగ్ రేటులో మన రాష్ట్రం ముందుంది. మధ్యప్రదేశ్ 38.4రోజులకు కేసులు రెట్టింపు అవుతున్న రాష్ట్రంగా చివరి స్థానంలో ఉంది. ఆగస్టు 7న మన రాష్ట్రంలో 62,938 టెస్టులు చేస్తే, ఆగస్టు 17 నాటికి 44,570కి తగ్గించారు. టెస్టులు పెంచాల్సింది పోయి తగ్గించారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. నిపుణులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేయాల్సిన కార్యక్రమాలు వారు చేయాలి. సమాజం మనకు గుర్తింపునిచ్చింది, బాధ్యతనిచ్చింది. అలాంటి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రజలందరికీ కరోనా విషయంలో అవగాహన పెంచడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
మాస్కులు ఏ విధంగా వాడాలి, దగ్గినపుడు, తుమ్మినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్యూనిటీని ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయాలపై ప్రజల్ని మరింతగా అప్రమత్తం చేయాలి. రోజువారీ ఆహారంపై, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇమ్యూనిటీని పెంచుకోవడంపై ప్రజలను చైతన్యపరచాలి. వ్యాధి బారిన పడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాథమికంగా ఏ రకమైన మందులు తీసుకోవాలి అనే విషయంపై అప్రమత్తం చేయాలి.
గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని ఆర్ధిక సమస్యలు ఎదురయ్యాయి. కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తును ఆలోచించి కొందరు, రేపు అనేది ఎలా ఉంటుందనే భయంతో ఇంకొందరు, సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో మరికొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయి. బంధుత్వాలు, మానవత్వం కూడా కొన్ని చోట్ల మంటగలవడం బాధాకరం.
కరోనా ప్రపంచ మానవాళికి ప్రమాదకరంగా మారినప్పటికీ, ఆరోగ్యం, ఆహారం, పరిశుభ్రత వంటి విషయాల్లో చాలా గుణపాఠాలు నేర్పింది. బాగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీవ్రంగా కష్టబడుతున్న తరుణంలో, మనదేశంలో లాక్ డౌన్ వంటి నిర్ణయాలతో వ్యాధి వ్యాప్తి కొంతమేర తగ్గింది. కరోనా ముందున్న రోజులు రావాలంటే చాలా సమయం పడుతుంది. అదే సమయంలో కరోనా బారిన పడని వారంతా, రేపు కరోనా నివారించిన తర్వాత వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
కరోనా వల్ల, లాక్ డౌన్ ల కారణంగా వలస కార్మికులు దేశవ్యాప్తంగా అష్టకష్టాల పాలయ్యారు. రవాణా లేక వందల కిలోమీటర్లు కాలినడకన స్వస్థలాలకు చేరేందుకు వాళ్లు నరకం చూశారు. భోజనం లేక, తాగడానికి నీళ్లు లేక, గమ్యం చేరే మార్గం కానరాక వలస కార్మికులు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా వల్ల ప్రవేట్ సంస్ధల్లో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, రోజు వారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విషయం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కార్మికుల కోసం ఏం చేయాలో ప్రతిపక్షంగా అది చేస్తాం. ఒక నెలలో దేశం మెత్తం మీద 16 లక్షల కరోనా కేసులు నమోదయితే మన రాష్ర్టం నుంచే 16 శాతం కేసులు వచ్చాయి. ప్రభుత్వమే కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలి .డాక్టర్లు, సైక్లియాలజిస్టులు ప్రజలను చైతన్యవంతం చేయాలి. అప్పుడే వైరస్ ని కట్టడి చేయవచ్చు. ప్రతిపక్ష నేతగా కరోనా నివారణకు, ప్రజల్లో చైతన్యం కల్గించడానికి ఏం చేయాలో అది చేశాం. పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహించాం, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు సాయం చేయటంతోపాటు ప్రజల్లో చైతన్యం కల్గించాం. డాక్టర్లు, నిపుణులతో ఆన్ లైన్ సమావేశాలు నిర్వహించి కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్గించాం.
భవన నిర్మాణ కార్మికులు, చేనేత కార్మికులు, రోజు వారీ కూలీలు ఇలా అనేక వృత్తుల వారు కరోనా వల్ల సమస్యలను ఎదుర్కోంటున్నారు. వారి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మికుల కోసం నాడు ఆలోచించి కార్మికుల సంక్షేమం కోసం భవన నిర్మాణ మరియు ఇతర సంక్షేమం మండలి ఏర్పాటు చేసాం. వారి సంక్షేమం కోసం నిదులు సేకరించి వారికే ఖర్చు చేసాం. ఇసుక నిలిపివేయటం, వల్ల ఇప్పుడు కరోనా వల్ల భవన నిర్మాణ కార్మికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 లక్షలమంది కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా ఎంత పెరిగితే ఆర్ధిక వ్యవస్ధ అంత దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రింట్ మీడియా, ఎలక్ర్టానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా కరోనా పట్ల ప్రజల్లో చైతన్యం కల్గించాలి.
ఆర్ధిక రంగం దెబ్బతినకుండా వర్చువల్ వర్కింగ్ అలవాటు చేసుకోవాలి. డిజిటల్ సోషలైజేషన్ ప్రమోట్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేసేలా చూడాలి. మనకు రాదు అనే విధంగా ఇష్టానుసారంగా తిరగడం మానుకుని, మనం జాగ్రత్తగా ఉండాలి, ఇతరుల జీవితాలను కాపాడాలి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలున్న ప్రస్తుత నేపథ్యంలో ప్రజలను మరింతగా అప్రమత్తం చేయడం మనందరి బాధ్యత. మంచి పనికి కాలం కూడా కలిసివస్తుంది. మంచి మనసుతో చేపట్టిన సంకల్పం విజయవంతం అవుతుంది అనడానికి చిత్తూరు వరుణ్ వలస కార్మికులకు అందించిన సేవలే నిదర్శనం. 64రోజుల పాటు 10వేల మందికి వలస కార్మికుల ఆకలిని వరుణ్ తీర్చడం ఇతరులకు మార్గదర్శకం.
కరోనాకు అప్రమత్తత, జాగ్రత్తే సరైన మందు. అందరికీ వస్తుంది, నాకు రాదులే అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. అత్యంత ప్రమాదకరం కూడా. ఒక వేళ వస్తే ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమవ్వాలి. కరోనా అనేది కళంకంగా భావించ రాదు. వైరస్ ను సమర్ధంగా ఎదుర్కోవాలి. రాజకీయాలకు అతీతంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలి. కోవిడ్ వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలి. కరోనా తదనంతర సమస్యలను కూడా గుర్తించి వాటి పరిష్కారం కోసం సూచనలివ్వాలి. ప్రజలు కష్టాల్లో ఉంటే దేశం కూడా కష్టాల్లో చిక్కుకుంటుంది.
పరిశుభ్రత అనేది మన సంస్కృతిలో భాగం కావాలి. కరోనా నేర్పిన పాఠాలు జీవితకాలం పాటించాలి. చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత నిత్యకృత్యం కావాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. దురలవాట్లను మానుకోవాలి. శారీరక వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిళ్లు అధిగమించాలి. ఆరోగ్యకర జీవితం వైపు అడుగులు వేయాలి.
No comments:
Post a Comment